బుమ్రా వేలంలో ఉండి ఉంటే అద్భుతమే జరిగి ఉండేది: ఆశిష్ నెహ్రా ప్రశంసలు

  • బౌలర్‌గా బుమ్రా ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడన్న నెహ్రా
  • ఒత్తిడిని తట్టుకొన్న విధానం ప్రశంసనీయమన్న నెహ్రా
  • కివీస్‌తో వైట్ వాష్ తర్వాత జట్టును నడిపించిన తీరు అద్భుతమని వ్యాఖ్య
టీమిండియా ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రాపై గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. బుమ్రా ఐపీఎల్ వేలంలో ఉండి ఉంటే ఏదైనా అద్భుతమే జరిగి ఉండేదన్నారు. అతను వేలం బరిలో ఉంటే ఐపీఎల్ జట్లకు రూ.520 కోట్ల పర్స్ కూడా సరిపోయేది కాదన్నారు.

బౌలర్‌గా బుమ్రా ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడని కితాబునిచ్చారు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి మ్యాచ్‌కు అతను కెప్టెన్‌గా ఉన్నాడన్నారు. సహజంగానే బుమ్రాపై చాలా ఒత్తిడి ఉండాలని, కానీ ఒత్తిడిని తట్టుకొన్న విధానం ప్రశంసనీయమన్నారు. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై 0-3తో వైట్ వాష్ తర్వాత బుమ్రా జట్టును నడిపించిన తీరు అద్భుతమన్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ తొలి టెస్టుకు బుమ్రా సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. భారత్‌లో కివీస్ చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియాను బుమ్రాను అద్భుతంగా నడిపించాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బుమ్రా 2013 నుంచి ముంబైకి ఆడుతున్నాడు. బుమ్రాను ఈ జట్టు ఒక్కసారి కూడా విడిచిపెట్టలేదు. ఈసారి మెగా వేలానికి ముందు జట్టుకు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను కాదని తొలి ప్రాధాన్య ఆటగాడిగా బుమ్రాను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మను రూ.16.30 కోట్లకు అట్టిపెట్టుకుంది.


More Telugu News