శోభిత మెడ‌లో చైతూ మూడు ముళ్లు.. వీడియో చూశారా..?

  • అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘ‌నంగా చైతూ-శోభిత వివాహం  
  • వేద‌మంత్రాల సాక్షిగా స‌రిగ్గా రాత్రి 8.13 గంట‌ల‌కు శోభిత మెడ‌లో మూడుముళ్లు వేసిన‌ చైతూ 
  • అన్న‌య్య పెళ్లి కావ‌డంతో సంతోషంతో విజిల్ వేసిన అఖిల్
నాగ‌చైత‌న్య‌-శోభిత ధూళిపాళ్ల వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బ‌య‌టికొచ్చింది. పండితుల వేద‌మంత్రాల సాక్షిగా స‌రిగ్గా రాత్రి 8.13 గంట‌ల‌కు శోభిత మెడ‌లో చైతూ మూడుముళ్లు వేశారు. ఆ స‌మ‌యంలో నాగార్జున‌, అమ‌ల‌, వెంక‌టేశ్‌, ద‌గ్గుబాటి సురేశ్ బాబుతో పాటు మిగ‌తా కుటుంబ స‌భ్యులు ఆనందంగా క‌నిపించారు. త‌న అన్న‌య్య పెళ్లి కావ‌డంతో అఖిల్ సంతోషంతో విజిల్ వేయ‌డం కూడా వీడియోలో ఉంది. 




More Telugu News