నెల్లూరులో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి నారాయణ
- కొత్తగా 16 పార్కులను ఏర్పాటు చేస్తామన్న నారాయణ
- పార్కులను దాతలు దత్తత తీసుకోవాలని విన్నపం
- జగన్ అరాచక పాలన చేశారని మండిపాటు
నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలోగా పార్కులు, సెంట్రల్ డివైడర్లను అందంగా ముస్తాబు చేస్తామని తెలిపారు. కొత్తగా 16 పార్కులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల్లూరుకు చెందిన దాతల సహకారాన్ని కూడా తీసుకుంటామని... దాతలు పార్కులను దత్తత తీసుకోవాలని కోరారు. నగరంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఐదేళ్ల పాటు జగన్ అరాచక పాలన చేశారని, నియంతలా పాలించారని... జగన్ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారని నారాయణ అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.