10వ తరగతిలో ఫెయిల్ అయ్యాను... ఆ తర్వాత కసి పెరిగింది: మంత్రి నారాయణ

  • తక్కువ మార్కులు వచ్చాయని పిల్లలను తిట్టకూడదన్న నారాయణ
  • బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని సూచన
  • పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లు జరపడం గొప్ప విషయమని ప్రశంస
తన విద్యా సంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఏపీ మంత్రి నారాయణ సంచలన విషయాన్ని వెల్లడించారు. 1972లో తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని ఆయన తెలిపారు. ఈ తర్వాత తనలో కసి పెరిగిందని డిగ్రీ, పీజీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా తయారయ్యానని చెప్పారు. నెల్లూరులోని బీవీఎస్ గాళ్స్ హైస్కూల్లో ఈరోజు జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకూడదని... వారు బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని నారాయణ చెప్పారు. రాష్ట్రంలో 45,094 స్కూళ్లలో 36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మీటింగ్ లు జరపడం గొప్ప విషయమని చెప్పారు.


More Telugu News