లౌక్య ఎంటర్టయిన్ మెంట్స్ కొత్త చిత్రంలో శివాజీ
- గతంలో కలర్ ఫొటో, బెదురులంక చిత్రాలు నిర్మించిన లౌక్య సంస్థ
- తాజాగా ప్రొడక్షన్ నెం.5
- శివాజీని తమ చిత్రంలోకి ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల
ఒకప్పుడు హీరోగా సక్సెస్ పుల్ కెరీర్ ను చూసిన శివాజీ... ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా లౌక్య ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రంలోకి శివాజీకి స్వాగతం పలుకుతూ లౌక్య ఎంటర్టయిన్ మెంట్స్ ప్రకటన ఇచ్చింది.
లౌక్య ఎంటర్టయిన్ మెంట్స్ నుంచి వస్తున్న ఐదో చిత్రం ఇది. రవీంద్ర బెనర్జీ ముప్పనేని సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. లౌక్య ఎంటర్టయిన్ మెంట్స్ నుంచి గతంలో కలర్ ఫొటో, బెదురులంక వంటి హిట్ చిత్రాలు రావడం విశేషం.