మా మీద కోపంతో తెలంగాణ తల్లి రూపురేఖలు మాయం చేశాడు: కేటీఆర్
- ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- తెలంగాణ తల్లి రూపం మార్చడంపై కేటీఆర్ ఆగ్రహం
- రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా మీద కోపంతో ఇవాళ తెలంగాణ తల్లి రూపురేఖలు మాయం చేశాడు... రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడు... అప్పుడు కూడా మేం మౌనంగా ఉండాలా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలి కానీ, తెలంగాణ తల్లినే మార్చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని దేవతలా చూసుకోవాలనే ఈ సమాజంలో... ప్రత్యేకించి తెలంగాణ తల్లిని పేదరాలిగా చూపించడం ఎంతవరకు సమంజసం? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంత దిక్కుమాలిన మనస్తత్వం ఏంటి? అని విమర్శించారు.
వారు పెడుతున్నది తెలంగాణ తల్లిని కాదు... కాంగ్రెస్ తల్లిని, ఢిల్లీ తల్లిని అని వ్యాఖ్యానించారు. అభయ హస్తంతో ఉన్న ఆ బొమ్మను కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలి కానీ, సచివాలయంలో పెట్టి తెలంగాణ తల్లి అంటే ఎలా? మెడ మీద తల ఉన్నవాడు ఎవడైనా అలా చేస్తాడా? అని మండిపడ్డారు.
"ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి వేరుపడాలని పోరాటాలు జరిగిన నాడు ఆంధ్ర మాత ఉండేది. ఆ తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగేటప్పుడు... మహాకవి దాశరథి, రావెళ్ల వెంకట రామారావు గారు తెలంగాణ తల్లి గురించి ప్రస్తావించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగుతల్లి అన్నారు. తెలుగుతల్లి విగ్రహాలు ఇప్పుడెక్కడ ఉన్నాయి? తెలుగుతల్లి విగ్రహాలు రెండు చోట్ల మాత్రమే కనిపించేవి. ఒకటి సెక్రటేరియట్ ముందు, రెండోది మహబూబ్ నగర్ లో. మూడోది... తెలంగాణ ఉద్యమం వచ్చాక తిరుపతిలో ఏర్పాటు చేశారు.
భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. మరి తెలంగాణ కంటే పేద రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఘనంగా ఉండాలా...? అక్కడి తెలుగుతల్లి మాత్రం బంగారు కిరీటాలు, బంగారు నగలు ధరించి ఉండాలి... ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి భావదారిద్ర్యం వల్ల తెలంగాణ తల్లి ఒక పేదరాలిగా కనిపించాలా? ఇదేం దరిద్రపు ఆలోచనా విధానం?
ఒక ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చెప్పుకుంటే అంతేకంటే భావదారిద్ర్యం ఇంకేదైనా ఉంటుందా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్న పనికిమాలిన సలహా ఇచ్చిన పర్వెర్టెడ్ మేధావి ఎవరు... మేమా?
మేం ఉద్యమంలో పాల్గొని, జైళ్లకు వెళ్లిన వాళ్లం... ఇదంతా చూస్తుంటే మాకు ఆవేశం రాదా? ఆ రోజు తుపాకీ పట్టుకుని మాపైకి వచ్చినోడు... ఇవాళ జాక్ పాట్ తో సీఎం అయ్యి... మొత్తం తెలంగాణ రూపురేఖలు మార్చేస్తా, తెలంగాణ తల్లిని మార్చేస్తా, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడు. అంతా మా మీద కోపంతో చేస్తున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటికీ ప్రజల్లో బలంగానే ఉంది. ప్రజలకు అన్నీ తెలుసు" అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.