నాదెండ్ల మనోహర్ పరుచూరి బ్రదర్స్ లా మాట్లాడడం సరికాదు: బొత్స
- విశాఖలో బొత్స ప్రెస్ మీట్
- ధాన్యం కొనుగోలు అంశంలో నాదెండ్ల తీరు సరిగా లేదని విమర్శలు
- వాస్తవాలు గుర్తించి మాట్లాడాలని హితవు
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు అంశంలో పరుచూరి బ్రదర్స్ లా మాట్లాడుతున్నారని విమర్శించారు. పరుచూరి బ్రదర్స్ సినిమాల్లో డైలాగులు రాస్తుంటారని, వాళ్ల డైలాగులకు రెండు వైపులా పదును ఉంటుందని, ఇటైనా మాట్లాడొచ్చు, అటైనా మాట్లాడొచ్చు అని వివరించారు.
కానీ, ఇది ప్రభుత్వం అని, పరుచూరి బ్రదర్స్ లా డైలాగులు చెబుతానంటే కుదరదని బొత్స స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వాస్తవాలు మాట్లాడడం అలవర్చుకోవాలని హితవు పలికారు.
"ఒక్కో ప్రాంతంలో వాతావరణం, కాలం, వర్షపాతం ఇలా పలు అంశాలను అనుసరించి ఒక్కోసారి పంట ఎక్కువ పండుతుంది, ఒక్కోసారి తక్కువ పండుతుంది. ఎక్కువ పండినప్పుడు వచ్చి... తక్కువ పండిన దాంతో లెక్కబెట్టుకుని ఆ ప్రకారమే ముందుకుపోతామంటే ఎలా కుదురుతుంది?" అని బొత్స వ్యాఖ్యానించారు.