తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్య‌క్షుడిగా జితేంద‌ర్ రెడ్డి

  • న‌వంబ‌ర్ 21న జ‌రిగిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నిక‌లు
  • చాముండేశ్వ‌రి నాథ్ పై గెలిచిన జితేంద‌ర్ రెడ్డి
  • ఒలింపిక్ సంఘం సెక్ర‌ట‌రీగా మ‌ల్లారెడ్డి విజ‌యం
తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్య‌క్షుడిగా మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. న‌వంబ‌ర్ 21న జ‌రిగిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం చాముండేశ్వ‌రి నాథ్‌, జితేంద‌ర్ రెడ్డి పోటీ ప‌డ్డారు. అసోసియేష‌న్‌లోని మొత్తం 68 మంది స‌భ్యుల‌కు గాను 59 మంది ఓటు వేశారు. 

ఇందులో జితేంద‌ర్ రెడ్డికి 43 ఓట్లు వ‌స్తే.. చాముండేశ్వ‌రి నాథ్‌కు కేవ‌లం 9 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో జితేంద‌ర్ రెడ్డి 34 ఓట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించారు. ఇక తెలంగాణ ఒలింపిక్ సంఘం సెక్ర‌ట‌రీగా మ‌ల్లారెడ్డి గెలుపొందారు.      


More Telugu News