మీడియా ప్రతినిధిపై దాడి ఘటన.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు
- టీ9 యాజమాన్యానికి ప్రత్యేకంగా ఒక లేఖ రాసిన మోహన్ బాబు
- తన కుటుంబ గొడవ పెద్దదిగా మారడంతో ఆవేశంలో ఆ ఘటన జరిగిందన్న నటుడు
- ఆ రోజు జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధించిందని వ్యాఖ్య
- టీవీ9 టీంకి, జర్నలిస్ట్ రంజిత్ కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు
మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు టీ9కి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీ9 యాజమాన్యానికి ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. తన కుటుంబ ఘటన పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఘటన అనంతరం 48 గంటల పాటు ఆసుపత్రిపాలు కావడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి 30 మంది లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశానని పేర్కొన్నారు. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధించిందన్నారు.
తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నానని, టీవీ9 టీంకి, జర్నలిస్ట్ మిత్రుడు రంజిత్ కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 'మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నా'నని మోహన్ బాబులు తన లేఖలో తెలిపారు.
కాగా, ఈ ఘటనలో ఇప్పటికే మోహన్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయిన విషయం తెలిసిందే. అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు.. గురువారం ఆయనపై 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.