న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై హైదరాబాద్ పోలీసుల కఠిన ఆంక్షలు
- వేడుకల సందర్భంగా మార్గదర్శకాలు విడుదల చేసిన పోలీసులు
- ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- మైనర్లకు బార్లు, పబ్‌లలో నో ఎంట్రీ
- రాత్రి పది దాటితో లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాల్సిందే
- డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ. 10 వేల జరిమానా
న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్లు తప్పనిసరిగా నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణం కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని, అందరూ తప్పకుండా వీటికి కట్టుబడి నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు.
ఆంక్షలు ఇలా..
* ఈవెంట్ వేదికల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
* సెలబ్రేషన్స్ సందర్భంగా అసభ్యకర, అశ్లీల డ్యాన్స్‌లకు చోటులేదు.
* ధ్వని కాలుష్యం నేపథ్యంలో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు.
* బార్లు, పబ్‌లలో మైనర్లకు అనుమతి లేదు.
* పార్టీల్లో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేస్తూ దొరికినా కఠిన చర్యలు.
* డ్రంకెన్ డ్రైవింగ్ విషయంలో కఠిన చర్యలు ఉంటాయి. దొరికితే రూ. 10 వేల వరకు జరిమానాతోపాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష తప్పదు.