కాకినాడలో కుప్పకూలిన వేదిక... కిందపడిపోయిన యనమల తదితరులు
- కుడా చైర్మన్ గా తుమ్మల బాబు
- నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం
- వేదికపైకి పరిమితికి మించి ఎక్కడంతో కూలిపోయిన వైనం
- వేదికపై యనమల, చినరాజప్ప, పంతం నానాజీ, హరిప్రసాద్
కాకినాడలో 'కుడా' చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకార వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. అయితే వేదిక ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. కుడా చైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేదికపై టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప.... జనసేన నేతలు పంతం నానాజీ, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.
అయితే, వేదిక పైకి ఎక్కువ మంది రావడంతో, వేదిక కుప్పకూలింది. యనమల తదితరులు కిందపడిపోయారు. దాంతో అక్కడ ఆందోళన నెలకొంది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిందపడిన నేతలను కార్యకర్తలు పైకి లేపారు. ఆ తర్వాత కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది.