ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలే... ముఖ్య అతిథిగా రామ్ చరణ్!

  • ముగింపు దశకు బిగ్ బాస్ సీజన్-8
  • నేటి రాత్రి 7 గంటలకు స్టార్ మా టీవీలో ప్రారంభమైన ఫైనల్ ఎపిసోడ్
  • విజేతకు రూ.55 లక్షల ప్రైజ్ మనీ!
మూడు నెలల పాటు తెలుగు రాష్ట్రాల బుల్లితెర వీక్షకులను ఎంతగానో అలరించిన అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-8 ముగింపు దశకు చేరుకుంది. మా టీవీ చానల్లో నేడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారమవుతోంది. రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు స్టార్ మా చానల్ ప్రోమో రిలీజ్ చేసింది.

ఈసారి బిగ్ బాస్ ఫైనల్ వీక్ కు అర్హత పొందింది నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాశ్, నభీల్. వీరిలో విన్నర్ ఎవరన్నది అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. విజేత గురించి యూట్యూబ్ లో కొన్ని వీడియోలు వచ్చినప్పటికీ, వాటిలో నిజం ఎంతన్నది నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో తేలనుంది.  

కాగా, ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు బిగ్ బాస్ సీజన్-8లో ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన వాళ్లు కూడా హాజరయ్యారు. ఈ సీజన్ విన్నర్ ఎవరంటూ వారిని హోస్ట్ నాగార్జున ప్రశ్నించారు. చాలామంది నిఖిల్, గౌతమ్, ప్రేరణల పేర్లు చెప్పారు. ఇక, ఈ సీజన్ విజేతకు రూ.55 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.


More Telugu News