శ్రీకాకుళం జిల్లాలో హత్యా రాజకీయాలకు స్థానం లేదు: అచ్చెన్నాయుడు

  • పలాసలో టీడీపీ నేత హత్యకు కుట్ర పన్నారన్న అచ్చెన్నాయుడు
  • కుట్ర వెనుక ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరిక
  • వైసీపీ హయాంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని విమర్శ
శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేత హత్యకు కుట్ర పన్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. 

వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని... అధికారాన్ని కోల్పోయినా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ నేత హత్య కుట్ర వెనుక ఎంతటివారు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో హత్యా రాజకీయాలకు స్థానం లేదని చెప్పారు.


More Telugu News