ఎల్లుండి కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్... పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
- అదానీ, మణిపూర్ అంశాలను నిరసిస్తూ ఛలో రాజ్ భవన్
- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన
- నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లనున్న నేతలు
ఎల్లుండి ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
గౌతమ్ అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అమెరికాలో కేసు నమోదైన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాగే మణిపూర్‌లో అల్లర్లు జరిగినప్పటికీ ప్రధాని మోదీ ఇప్పటి వరకు అక్కడకు వెళ్లలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
వీటిని నిరసిస్తూ ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో 18వ తేదీ ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు.