కౌశిక్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... తప్పుబట్టిన హైకోర్టు
- బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు
- విచారణలో భాగంగా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- నోటీసులు ఇవ్వకుండా తన మొబైల్ తీసుకున్నారని కౌశిక్ రెడ్డి పిటిషన్
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొబైల్‌ను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు... ఎమ్మెల్యే మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాఫ్తులో భాగంగా అతని మొబైల్‌ను తీసుకున్నారు.
అయితే పోలీసులు తన మొబైల్‌ను లాక్కున్నారని, కనీసం తనకు నోటీసులు కూడా ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.
ఈ మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కుట్రలు పన్నుతున్నారన్నారు. అయితే ఫోన్ సీజ్ చేయాల్సి వస్తే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. మొబైల్ ను ఆయనకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.