అడివి శేష్ బర్త్‌డే స్పెషల్.. 'డెకాయిట్' నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్.. మారిన హీరోయిన్!
- నేడు అడివి శేష్ పుట్టిన రోజు
- డెకాయిట్ నుంచి రెండు కొత్త పోస్టర్స్ విడుదల చేసిన మేకర్స్
- ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ స్థానంలో మృణాల్ ఠాకూర్
నేడు టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్ నుంచి మేకర్స్ రెండు కొత్త పోస్టర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ కు ఒక ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అయితే, ఇంతకుముందు ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ ను ప్రకటించగా.. ఇప్పుడు ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు.
ఇక తాజాగా రెండు పోస్టర్లు విడుదల అయ్యాయి. అందులో ఒక పోస్టర్‌ను మృణాల్ 'ఎక్స్' (ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. "అవును వదిలేసాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను" అని రాసుకొచ్చారు. దీనికి రిప్లైగా అడివి శేష్ మరో పోస్టర్ షేర్ చేశారు. దీనికి ఆయన.. "అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు.. ఇడిచిపెట్టను.. తేల్చాల్సిందే" అని రాసుకొచ్చారు. ఇప్పుడీ రెండు పోస్టర్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కాగా, ఈ సినిమాను షానీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.