బీజేపీ, కాంగ్రెస్ లకు థాకరే కీలక సూచన

  • సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న థాకరే
  • సావర్కర్ ను కాంగ్రెస్ విమర్శించవద్దని సూచన
  • నెహ్రూను బీజేపీ విమర్శించవద్దని హితవు
వీర సావర్కర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. సావర్కర్ కు బీజేపీ భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని బీజేపీ పరిశీలించకపోతే సావర్కర్ గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేనట్టేనని చెప్పారు. 

అలాగే, సావర్కర్ ను విమర్శించడాన్ని కాంగ్రెస్ మానుకోవాలని... ఇదే సమయంలో నెహ్రూని విమర్శించడాన్ని బీజేపీ మానుకోవాలని థాకరే సూచించారు. సావర్కర్, నెహ్రూ ఇద్దరూ అప్పటి కాలానికి తగిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ కూడా పదేపదే నెహ్రూ పేరును లేవనెత్తడాన్ని మానుకోవాలని తెలిపారు.


More Telugu News