గూగుల్ ను అడగాలన్న బుమ్రా వ్యాఖ్యలపై సుందర్ పిచాయ్ స్పందన

  • టెస్ట్ లో ఒక ఓవర్ లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో గూగుల్ చేయాలన్న బుమ్రా
  • తాను గూగుల్ చేశానన్న సుందర్ పిచాయ్
  • బుమ్రా బ్యాటింగ్ పై ప్రశంసలు గుప్పించిన గూగుల్ సీఈవో
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతు మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా బంతితో అదరగొడుతున్నాడు. బ్యాట్ తో కూడా ఆకట్టుకుంటున్నాడు. టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బుమ్రా సమాధానం ఇస్తూ... మీరు తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారని... టెస్టుల్లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసింది ఎవరో గూగుల్ చేయాలని సూచించాడు. 2022లో బర్మింగ్ హామ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఒకే ఓవర్ లో ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఇది ప్రపంచ రికార్డ్ గా నిలిచింది. 

ఈ క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... తాను గూగుల్ చేశానని, కమిన్స్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన వారికి బ్యాటింగ్ ఎలా చేయాలో బాగా తెలుసని చెప్పారు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆకాశ్ దీప్ తో కలిసి బుమ్రా ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడని ప్రశంసించారు. ఇన్నింగ్స్ చివర్లో బుమ్రా, ఆకాశ్ దీప్ అద్భుతంగా పోరాడారు. కమిన్స్ బౌలింగ్ లో బుమ్రా కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు.


More Telugu News