కంట్రోల్ తప్పి బిల్డింగ్పై కుప్పకూలిన విమానం.. వీడియో ఇదిగో
- ట్రైనీ పైలెట్, ఒక ప్యాసింజర్ మృతి
- రోడ్డుపై వెళుతున్న వాహనాల డాష్ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు
- అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఘటన
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక శిక్షణా విమానం నియంత్రణ కోల్పోయి హోనోలులు ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న ఓ బిల్డింగ్పై కుప్పకూలింది. ‘సెస్నా 208 కారావాన్’ అనే ప్యాసింజర్ విమానం కంట్రోల్ తప్పి ఎత్తును కోల్పోయిందని, ఖాళీగా ఉన్న ఓ భవనంపైకి దూసుకెళ్లిందని అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 22 ఏళ్ల ట్రైనీ పైలట్ హిరమ్ డిఫ్రైస్, ప్రెస్టన్ అనే ప్యాసింజర్ మృతి చెందారని తెలిపారు.
కాగా, విమానం కూలుతున్న దృశ్యాలు రహదారిపై వెళుతున్న వాహనాల డాష్ బోర్డు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ తర్వాత పొగలు కమ్ముకోవడం వీడియోల్లో కనిపించింది.
అగ్నిమాపక విభాగం సిబ్బంది, పోలీసులు, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విమానంలో ఇద్దరు మినహా ఇంకెవరూ చనిపోలేదని వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దర్యాప్తు ప్రారంభించింది.