క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం: ఉదయనిధి స్టాలిన్
- క్రైస్తవుడినని చెప్పుకునేందుకు ఎంతగానో గర్వపడుతున్నానన్న ఉదయనిధి
- అన్ని మతాలు తనకు సమ్మతమేనని వ్యాఖ్య
- క్రైస్తవులు, ముస్లింలు డీఎంకేకు మద్దతుగా ఉంటారన్న ఉదయనిధి
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనను క్రైస్తవుడిగా భావిస్తే తాను క్రైస్తవుడినని, ముస్లింగా భావిస్తే ముస్లింనని, హిందువుగా భావిస్తే హిందువునని ఆయన చెప్పారు. అన్ని మతాలు తనకు సమ్మతమేనని అన్నారు. క్రిస్మస్ అంటే తనకు చాలా ఇష్టమని... క్రైస్తవుడినని చెప్పుకునేందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నానని చెప్పారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తానొక క్రైస్తవుడినని చెపితే... తమ రాజకీయ ప్రత్యర్థులకు కడుపుమంటగా మారిందని విమర్శించారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయనిధి మండిపడ్డారు. ఆ న్యాయమూర్తిని తొలగించే బిల్లుకు డీఎంకే, ఇండియా కూటమి ఎంపీలు మద్దతు ప్రకటిస్తే.. అన్నాడీఎంకే మద్దతు ప్రకటించకుండా మౌనంగా ఉందని విమర్శించారు. క్రైస్తవులు, ముస్లింలు ఎప్పుడూ డీఎంకేకు మద్దతుగా ఉంటారని చెప్పారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.