స్టాక్ మార్కెట్లలో మరో భారీ పతనం... 1,176 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

  • వరుసగా ఐదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్
  • 364 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.97 శాతం నష్టపోయిన టెక్ మహీంద్రా షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు సూచీలు నష్టోయాయి. విదేశీ మదుపరుల అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,176 పాయింట్లు నష్టపోయి 78,041కి పడిపోయింది. నిఫ్టీ 364 పాయింట్లు కోల్పోయి 23,587కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
నెస్లే ఇండియా (0.12%), టైటాన్ (0.07%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-3.97%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.53%), యాక్సిస్ బ్యాంక్ (-3.28%), టాటా మోటార్స్ (-2.73%).


More Telugu News