తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట

  • ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ కు రిలీఫ్
  • 10 రోజుల వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం
  • ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ కు ఆదేశాలు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 


More Telugu News