ఆకస్మిక తనిఖీలు చేస్తా!: సీఎం చంద్రబాబు

  • పెనమలూరు నియోజకవర్గం గంగూరులో చంద్రబాబు పర్యటన
  • ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన... రైతులతో ముఖాముఖి
  • అనంతరం మీడియా సమావేశం
  • బియ్యం అక్రమ రవాణాదారులకు స్ట్రిక్ట్ వార్నింగ్
ఏపీ సీఎం చంద్రబాబు నేడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తర్వాత, రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

భవిష్యత్తులో ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడించారు. "గోనె సంచులు ఎక్కడ నుంచి వెళ్లాయో అనే దానిపై కచ్చితంగా ఉంటాం. బియ్యం అక్రమ రవాణాను అరికడతాం. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉంటాం" అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.  

రైతులు ఏ మిల్లులో ధాన్యం అమ్ముకోవాలనుకుంటే ఆ రైస్ మిల్లులో అమ్ముకోవచ్చని, రైతు అనుకూలతను బట్టి తనే ఎంచుకునే సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దళారీ వ్యవస్థపై కచ్చితమైన చర్యలుంటాయని, దళారీ వ్యవస్థ ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

సైలోస్ సిస్టంతో అధిక లాభం

త్వరలో సైలోస్ సిస్టమ్‌ కూడా రైతులకు అందుబాటులోకి తీసుకుని రావాలని చూస్తున్నాము. సైలోస్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే రైతులు కావాల్సిన సమయంలో పంటను అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీంతో నిల్వ పెట్టిన ధాన్యానికి ఎక్కువ రేటు వస్తుంది. ఎంటీయూ 1262 గత ఏడాది కృష్ణా జిల్లాలో 3,582 మెట్రిక్ టన్నులు దిగుబడి ఇస్తే.. ఈ ఏడాది 32,859 మెట్రిక్ టన్నులు దిగుబడిని ఇచ్చింది. ఇతర జిల్లాల్లోనూ ఈ పంట దిగుబడి ఎక్కువగా ఉంది... అని చంద్రబాబు వివరించారు.


More Telugu News