అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత... విద్యార్థి సంఘాల ఆందోళన
- అల్లు అర్జున్ నివాసం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
- నివాసంలోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నం
- అల్లు అర్జున్ ఇంటిపైకి రాళ్లు, టమాటాలు విసిరిన వైనం
హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు నేడు అల్లు అర్జున్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఖబడ్దార్ అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసంపైకి రాళ్లు, టమాటాలు విసిరారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ నివాసంలోని పూలకుండీలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో, అల్లు అర్జున్ నివాసం వద్ద భద్రతను పెంచారు.