డాలస్ లో కళ్లు చెదిరేలా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్... ఫొటోలు ఇవిగో!
- అమెరికా గడ్డపై గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- డాలస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ కు పోటెత్తిన చరణ్ ఫ్యాన్స్
- అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకున్న తొలి భారతీయ చిత్రం గేమ్ చేంజర్
టాలీవుడ్ లో భారీ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇటీవలే వచ్చిన పుష్ప-2 చరిత్ర సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. నిన్న (డిసెంబరు 21) ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలోని డాలస్ నగరంలో కళ్లు చెదిరేలా జరిగింది.
సినిమా రిలీజ్ కు ముందే గేమ్ చేంజర్ ఈ ప్రీ రిలీజ్ వేడుక ద్వారా చరిత్ర సృష్టించింది. ఓ భారతీయ సినిమా అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోవడం గేమ్ చేంజర్ తోనే ప్రథమం. డాలస్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు పోటెత్తారు. ఇక్కడి కర్టిస్ కల్వెల్ సెంటర్ క్రిక్కిరిసిపోయింది. పుష్ప-2 దర్శకుడు సుకుమార్ ఈ వేడుకకు హాజరుకావడం విశేషం.
.