యూట్యూబ్​, ఇన్​ స్టా వీడియోలేవైనా... సూపర్​ వీడియో ఎడిటింగ్​ యాప్స్​ ఇవే!

  • మనం తీసే వీడియోలను తగిన విధంగా ఎడిట్ చేసుకునేందుకు వీటితో చాన్స్
  • కావాల్సిన ట్రాన్సిషన్లు, ఎఫెక్టులు ఇచ్చుకునేందుకు వీలు
  • ఆడియో, వీడియోలను కావాల్సినట్టుగా మార్చుకునే వెసులుబాటు
మనం తీసే వీడియోలను అద్భుతంగా ఎడిట్ చేసుకోవడానికి ఎన్నో రకాల అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్నింటిలో ఎక్కువ సంఖ్యలో ఫీచర్లు ఉంటాయి. వీడియో ఎడిటింగ్ ను సులువుగా పూర్తి చేసేందుకు వీలుగా ఉంటాయి. అలా 2024 సంవత్సరానికి సంబంధించి మంచి వీడియో ఎడిట్ యాప్స్ ను నిపుణులు ఎంపిక చేశారు. అవేమిటంటే...

డావిన్సీ రిసాల్వ్ (DAVINCI RESOLVE)...
మనం తీసే వీడియోల్లోని రంగులను అద్భుతమైన రీతిలో తీర్చిద్దుకునేందుకు ఈ అప్లికేషన్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా నేర్చుకుంటున్న వారు కూడా సులభంగా వీడియో ఎడిటింగ్ చేయగలగడం, ఎఫెక్టులు ఇవ్వగలగడం దీని ప్రత్యేకత. ఒకేసారి ఎక్కువ మంది ఒకే ప్రాజెక్టుపై పనిచేసేందుకు దీనిలో అవకాశం ఉంది.

క్యాప్ కట్ (CapCut)...
గత ఏడాదిలో విపరీతంగా పాపులర్ అయిన వీడియో ఎడిటింగ్ అప్లికేషన్లలో ఇది ఒకటి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్ తో వీడియోలను సులువుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆటోమేటిగ్గా ట్రాన్సిషన్లు, ఎఫెక్టులు రావడం వల్ల పని సులువు అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

అడోబ్ ప్రీమియర్ రష్ (Adobe Premiere Rush)...
వేగంగా, సులువుగా వీడియో ఎడిటింగ్ చేసుకునేందుకు ఈ అప్లికేషన్ తోడ్పడుతుంది. మొబైల్ ఎడిటింగ్ కు సంబంధించి అద్భుతంగా పనిచేస్తోందని పేరుపొందింది. కలర్ కరెక్షన్, ఇతర మంచి టూల్స్ దీనిలో ఉన్నాయి.

క్లిప్ చాంప్ (ClipChamp)...
అధిక సామర్థ్యం ఉన్న కంప్యూటర్ల అవసరం లేకుండా... ఆన్ లైన్ లో వీడియో ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉన్న అప్లికేషన్ ఇది. దీనిలో పెద్ద సంఖ్యలో టెంప్లెట్స్, అసెట్స్ కూడా ఉన్నాయి. కృత్రిమ మేధ ఆధారితంగా ఆటోమేటిగ్గా వీడియోల రీసైజింగ్, ట్రాన్సిషన్లు, ఎన్ హాన్సింగ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆప్షన్ ఇది.

పవర్ డైరెక్టర్ 365 (PowerDirector365)...
సైబర్ లింక్ సంస్థకు చెందిన పవర్ డైరెక్టర్ కూడా చాలా సులువుగా వీడియోలను ఎడిట్ చేసుకోవడానికి తోడ్పడే అప్లికేషన్. ఇందులో కృత్రిమ మేధ ఆధారిత టూల్స్, 360 డిగ్రీ వీడియో ఎడిటింగ్ ఆప్షన్ మరింత ప్రత్యేకం. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల నుంచి సినిమా స్టూడెంట్ల దాకా అందరికీ ఉపయోగపడే అప్లికేషన్ ఇది.


More Telugu News