పోలీసులపై సీన్లు... అల్లు అర్జున్, సుకుమార్‌పై చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
- సినిమాలో పోలీసులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయన్న మల్లన్న
- సెన్సార్ బోర్డు సీన్లను కట్ చేయాల్సిందన్న తీన్మార్ మల్లన్న
- ఇలాంటి సినిమాలను నిషేధించాలన్న తీన్మార్ మల్లన్న
పుష్ప-2 సినిమా డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో పోలీసులను కించపరిచేలా సన్నివేశం ఉందంటూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన అనంతరం మల్లన్న మాట్లాడుతూ... థియేటర్‌కు వెళ్లి సినిమా చూశానని, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయన్నారు. పోలీసుల పట్ల చిన్నచూపు చూసేలా సీన్లు ఉన్నాయన్నారు. సినిమాలో ఓ సీన్‌లో గంధపు చెక్కల స్మగ్లర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కారును ఢీకొడతాడని, పోలీస్ ఆఫీసర్ ఓ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతే, అందులో మూత్రం పోయడం పోలీసులను అవమానించడమే అన్నారు.
పోలీసులను అగౌరవపరిచేలా సీన్లు ఉన్నందుకు నిర్మాత, దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు. అసలు సెన్సార్ బోర్డు ఈ సీన్లను కట్ చేయాల్సిందని, కానీ ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఇలాంటి సినిమాలను నిషేధించి, మంచి సినిమాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సినిమాలు చేస్తున్న హీరో, తీస్తున్న దర్శక, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలన్నారు.