కుమారుడితో కలిసి హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని

  • గోడౌన్ లో పీడీఎస్ బియ్యం మాయం
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబం
  • ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పేర్ని జయసుధ
  • ఇటీవల పేర్ని నాని, పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)లకు పోలీసుల నోటీసులు
  • నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో పేర్ని నాని, కిట్టు క్వాష్ పిటిషన్లు
గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కావడంపై మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఈ కేసులో పేర్ని నాని అర్ధాంగి జయసుధ ఏ1గా, గోడౌన్ మేనేజర్ మానసతేజ ఏ2గా ఉన్నారు. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశారు. 

ఇక, ఈ కేసులో విచారణకు రావాలంటూ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)లకు పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయితే, పేర్ని నాని, ఆయన తనయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల నోటీసులను రద్దు చేయాలంటూ వారిరువురు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు రేపు (డిసెంబరు 24) విచారణ చేపట్టనుంది.


More Telugu News