అమెరికాలో తెలుగు విద్యార్థి మృతిపై స్పందించిన బండి సంజయ్
- భౌతికకాయం త్వరగా దేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటానన్న కేంద్రమంత్రి
- స్థానిక బీజేపీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి
- జైశంకర్ కార్యాలయానికి మెయిల్ పంపిన బండి సంజయ్
అమెరికాలో మృతి చెందిన తెలుగు విద్యార్థి వంశీ భౌతికకాయాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. హన్మకొండ జిల్లాకు చెందిన విద్యార్థి బండి వంశీ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వంశీ ఉంటున్న సెల్లార్‌లో పార్కింగ్ చేసిన కారులో విగతజీవిగా ఉండటాన్ని గుర్తించిన యువకులు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నేతల ద్వారా బండి సంజయ్ తెలుసుకున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కార్యాలయానికి బండి సంజయ్ మెయిల్ చేశారు.
అంతకుముందు, విషయం తెలియగానే వంశీ తండ్రి రాజయ్య, సోదరుడు సుమన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. వంశీ మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంశీ భౌతికకాయాన్ని త్వరితగతిన స్వదేశానికి రప్పిచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.