మూడ్ బాగోలేదా..? ఇవి తీసుకుంటే యాక్టివ్ కావొచ్చు!
- ఏదో ఒక పని ఒత్తిడితో అలసిపోయి డల్ గా మారేవారు కొందరు
- మానసిక ఒత్తిళ్లతో ఏమీ తోచకుండా ఉండిపోయేవారు మరికొందరు
- ఇతర కారణాలతోనూ మూడ్ బాగోలేక ఇబ్బందిపడేవారు ఇంకొందరు
- ఎవరైనా సరే... కొన్ని రకాల ఫుడ్ తో యాక్టివ్ కావొచ్చంటున్న ఆరోగ్య నిపుణులు
చాలా మంది తరచూ అలా డల్ గా కూర్చుండిపోతారు. ఏమైందని అడిగితే మూడ్ బాగోలేదని చెబుతూ ఉంటారు. ఏదో ఒక పని ఒత్తిడితో అలసిపోయిగానీ, మానసిక ఒత్తిళ్లతో గానీ ఏమీ తోచకుండాగానీ చాలా మంది డల్ గా ఉండిపోతారు. శారీరక కారణాలతోనూ మూడ్ బాగోలేక ఇంకొందరు ఇబ్బందిపడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని రకాల ఫుడ్ తో తిరిగి యాక్టివ్ కావొచ్చని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల హార్మోన్లు మానసికంగా, శారీరకంగా ఉత్తేజం కలిగిస్తాయని వివరిస్తున్నారు.
డార్క్ చాకోలెట్...
కొకోవా ఎక్కువగా ఉన్న డార్క్ చాకోలెట్ తింటే మూడ్ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాకోలెట్లలోని పదార్థాలు మనకు ఉత్సాహాన్ని కలిగించే ఎండార్ఫిన్, సెరటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయని.. మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి భావనను కలిగిస్తుందని వివరిస్తున్నారు. అయితే.. ఇది కేవలం డార్క్ చాకోలెట్లకే పరిమితమని, విపరీతంగా చక్కెర, పాల పదార్థాలు కలిపిన సాధారణ చాకోలెట్లతో ప్రయోజనం తక్కువని స్పష్టం చేస్తున్నారు.
అరటిపండ్లు...
అరటి పండ్లలో అధికంగా ఉండే విటమిన్ బీ6 మన శరీరంలో సెరటోనిన్ హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక అరటిలోని సహజ చక్కెరలు శరీరానికి త్వరగా శక్తిని ఇస్తాయని... అందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి విశ్రాంతి భావనను కలిగిస్తుందని వివరిస్తున్నారు. తద్వారా ఉత్సాహం కలుగుతుందని పేర్కొంటున్నారు.
డ్రైఫ్రూట్స్, గింజలు...
బాదం, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వంటివి కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపర్చి ఒత్తిడిని, డిప్రెషన్ ను తగ్గిస్తాయని వివరిస్తున్నారు.
ఓట్స్...
వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయని, శరీరంలో శక్తి విడుదల సమానంగా ఉండేలా చూస్తాయని... తద్వారా మూడ్ స్వింగ్స్ (వెంటవెంటనే మూడ్ మారిపోయే) సమస్యను అరికడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు
వీటిలో అధికంగా ఉండే ఫోలేట్ మన మెదడులో డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మనలో ఉత్సాహాన్ని కలిగించే న్యూరోట్రాన్స్ మీటర్ అని వివరిస్తున్నారు.
బెర్రీ జాతి పండ్లు..
బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్ బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి మెదడులో ఇన్ ఫ్లమేషన్ ను, ఒత్తిడిని నియంత్రించి... మానసిక ప్రశాంతతను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన మూడ్ ను, ఏకాగ్రతను పెంచుతాయని వివరిస్తున్నారు.
ఇక అవకాడోలు, చేపలు, పెరుగు, పసుపు తదితర ఆహార పదార్థాలు కూడా మనలో ఉత్సాహాన్ని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయని... తగిన శక్తిని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.