హనియేను మేమే హతమార్చాం.. వారి తలలు కూడా తెగ్గోస్తాం: హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్

  • జులైలో ఇరాన్‌లో హత్యకు గురైన హనియే
  • హమాస్‌ను, హిజ్బుల్లాను ఓడించామన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
  • ఇరాన్ రక్షణ వ్యవస్థను, దాని ఉత్పత్తి వ్యవస్థను దెబ్బతీశామని స్పష్టీకరణ
హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యపై ఇజ్రాయెల్ తొలిసారి పెదవి విప్పింది. అతడిని చంపింది తామేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తొలిసారి బహిరంగ ప్రకటన చేశారు. ఇరాన్‌లో ఈ ఏడాది జులైలో హనియే హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్‌పై ఇటీవలి కాలంలో హౌతీ ఉగ్రవాద సంస్థలు క్షిపణులు ప్రయోగిస్తున్నాయని పేర్కొన్న మంత్రి.. తాము హమాస్‌ను, హిజ్బుల్లాను ఓడించామని, ఇరాన్ రక్షణ వ్యవస్థ, దాని ఉత్పత్తి వ్యవస్థను దెబ్బతీశామని చెప్పారు.

సిరియాలో అసద్ పాలనను పడగొట్టామని కట్జ్ పేర్కొన్నారు. యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల ఆట కట్టించామని కట్జ్ చెప్పుకొచ్చారు. వారి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని, హనియా, సిన్వర్, నస్రల్లా మాదిరిగానే హొడీడా, సానాలోని వారి నేతల తలలు తెగ్గోస్తామని కట్జ్ హెచ్చరికలు జారీచేశారు.


More Telugu News