"ఆ విషయం మీకు తెలుసా?"... విచారణలో అల్లు అర్జున్‌ని పోలీసులు అడిగిన ప్రశ్నలు ఇవే!

  • మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రశ్నిస్తున్న పోలీసులు
  • 18 నుంచి 20 వరకు ప్రశ్నలు సిద్ధం చేసి అడుగుతున్నట్టు సమాచారం
  • చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌‌లో కొనసాగుతున్న విచారణ
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ పోలీసు విచారణ కొనసాగుతోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇవాళ (సోమవారం) ఉదయం 11 గంటల నుంచి పోలీసు అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. 18 నుంచి 20 వరకు ప్రశ్నలు సిద్ధం చేసి అడుగుతున్నట్టు తెలుస్తోంది.

అయితే, పోలీసులు అడిగి ప్రశ్నల్లో కొన్ని ఇవేనంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 
ఆ క్వశ్చన్స్ ఇవే..
1. సంధ్య థియేటర్‌కు రావడానికి పోలీసులు అనుమతి నిరాకరించారనే విషయం మీకు తెలుసా?
2. పోలీసు అనుమతి లేకపోయినా థియేటర్‌కు రావాలని మిమ్మల్ని ఎవరు పిలిచారు?
3. బయట జరిగిన తొక్కిసలాట గురించి ఏ పోలీసు అధికారైనా మీకు తెలియజేశారా?
4. మహిళ చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
5. థియేటర్‌కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?
6. రేవతి మృతి చెందిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడే తెలిసిందా? లేదా?
7. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా?
8. ఎవరూ చెప్పలేదని మీడియా ముందు ఎందుకు చెప్పారు
9. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
10. అభిమానులు, పోలీసుల మీద దాడిచేసిన బౌన్సర్లు ఎవరు?


More Telugu News