తక్కువ ధరలో డ్యూయల్​ స్క్రీన్​, 5జీ... లావా బ్లేజ్​ డ్యూయో 5జీ ఫోన్​ ఫీచర్లు ఇవే!

  • వెనుకవైపు చిన్నపాటి స్క్రీన్ తో లావా ఫోన్
  • డ్యూయల్ 5జీ సిమ్ సపోర్ట్.. 3డీ కర్వ్ డ్ మెయిన్ డిస్ ప్లే
  • మీడియం రేంజిలో మంచి ఫీచర్లతో విడుదల
లావా సంస్థ తమ సరికొత్త ‘లావా బ్లేజ్ డ్యూయో 5జీ’ ఫోన్ ను తాజాగా విడుదల చేసింది. మీడియం రేంజ్ ఫోన్లలో డ్యూయల్ స్క్రీన్ తో వస్తున్న ఫోన్లలో ఇది ఒకటి. దీనికి ముందువైపు ప్రధాన డిస్ ప్లేతోపాటు వెనుకవైపు కెమెరాల పక్కన చిన్న డిస్ ప్లేను ఇచ్చారు. కాల్స్, మేసేజీలు, సమయం ఇతర వివరాలను దాని నుంచి చూసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

‘లావా బ్లేజ్ డ్యూయో 5జీ’ ఫోన్ ఫీచర్లు ఇవిగో...
ముందువైపు 6.67 అంగుళాల పెద్ద డిస్ ప్లే. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో, త్రీడీ కర్వ్ డ్ అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడేవారికి ఇది బాగుంటుంది.
వెనుకవైపు కెమెరాల పక్కన 1.58 అంగుళాల సెకండరీ డిస్ ప్లే ఇచ్చారు.
ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్ సెట్ ను.. అత్యాధునిక ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్ ను ఇచ్చారు.
అత్యంత వేగంగా డేటా ట్రాన్స్ ఫర్ ను సపోర్ట్ చేసే.. యూఎఫ్ఎస్ 3.1 సాంకేతికతతోకూడిన 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఉంది. అయితే అదనంగా మెమెరీ కార్డు పెట్టుకునే సౌకర్యం కల్పించలేదు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ కెమెరాతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాను ఇచ్చారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ప్రధాన డిస్ ప్లే దిగువ భాగాన ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. 
ఈ ఫోన్ 8.45 మిల్లీమీటర్ల మందంతో.. 186 గ్రాముల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ రెండు సిమ్ స్లాట్లు కూడా 4జీ, 5జీ రెండింటినీ సపోర్ట్ చేస్తాయి. 
చార్జింగ్ కోసం యూఎస్ బీ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. 33 వాట్ల చార్జర్ తో వేగంగా చార్జ్ అవుతుంది.
బ్లూటూత్ 5.2, గైరోస్కోప్, కంపాస్, లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సిలరోమీటర్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ మోడల్ ధర రూ.18,999... 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ మోడల్ ధర 20,499గా కంపెనీ నిర్ణయించింది.
ఈ ఫోన్ సెలెస్టియల్ బ్లూ, ఆర్కిటిక్ వైట్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. 


More Telugu News