పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్

  • చిక్కడపల్లి పీఎస్ లో బన్నీని విచారించిన పోలీసులు
  • ముగిసిన విచారణ
  • తమకు అందుబాటులో ఉండాలన్న పోలీసులు
  • విచారణకు సహకరిస్తానన్న అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ ముగిసిన అనంతరం సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా, అవసరమైతే మరోసారి విచారణకు రావాలని బన్నీకి విచారణ అధికారులు తెలిపారు. తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు. దీనికి సమాధానంగా... విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు.

విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో పీఎస్ నుంచి ఇంటికి బయల్దేరారు. అల్లు అర్జున్ ప్రయాణించిన వాహనంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు, వారి తరపు న్యాయవాది ఉన్నారు.


More Telugu News