కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం
- కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ
- సదా అటల్ వద్ద పూల మాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు.
రాష్ట్రంలోని పలు రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్లు సమాచారం. అలాగే అమిత్ షా, జేపీ నడ్డాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది.
అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి సదా అటల్ వద్ద పూల మాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు.