జోరు చూపలేకపోయిన జాన్వీ కపూర్!

  • ఈ ఏడాది 'దేవర'తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ 
  • ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనుకున్న ఫ్యాన్స్ 
  • ఆశించినస్థాయిలో ఆమె పాత్రకి గ్లామర్ టచ్ ఇవ్వని కొరటాల
  • ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయిన జాన్వీ   

బాలీవుడ్ బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు. ఒక వైపున సినిమాలు చేస్తున్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ఆమెకి పెరుగుతున్న క్రేజ్ ఎక్కువనుకోవాలి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయింది. ఆమె అక్కడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి కూడా చాలా కాలం పాటు వెయిట్ చేసింది. ఆమె కోసం సరైన కథను ఎంపిక చేసుకోవడంలోనే ఆలస్యం జరుగుతూ వెళ్లింది. ఇంత చేసినా ఆమె ఆశించిన స్థాయిలో అక్కడ విజయాలను నమోదు చేయలేకపోయింది. 

ఇక శ్రీదేవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం. అందువలన ఆమె కూతురైన జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందా అని వాళ్లంతా ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. టాలీవుడ్ ఎంట్రీ కూడా అనుకున్నంత తేలికగా ఏమీ ఇవ్వలేదు. మొత్తానికి ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో ఈ ఏడాది జాన్వీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 'దేవర' సినిమాతో ఆమె ఇక్కడ బిజీ కావడం ఖాయమనే ప్రచారం, ఈ సినిమా రిలీజ్ కి ముందే జోరుగా జరిగింది. 

'దేవర' సినిమాకి జాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనే అంతా అనుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో జాన్వీ ఇక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా అందుకు కారణమనే టాక్ వినిపించింది. లవ్ .. రొమాన్స్ పాళ్లు తక్కువగా ఉండటం, డ్యూయెట్స్ కి ఎక్కువగా అవకాశం లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పుకున్నారు. ఒక మంచి కాంబినేషన్ చూసుకుని సెట్ చేసుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయింది. పార్టు 2లో ఆమె పాత్ర జోరు ఎలా ఉంటుందో చూడాలి మరి. 


More Telugu News