మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ

  • నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్
  • పార్థివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
  • మన్మోహన్ అంటేనే సంస్కరణలు గుర్తుకొస్తాయన్న మల్లు రవి
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. మన్మోహన్ లేని లోటు ఈ దేశానికి తీరనిదన్నారు. మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

మల్లు రవి కూడా ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మన్మోహన్ అంటేనే సంస్కరణలు గుర్తుకు వస్తాయన్నారు. భారతదేశం ఒక మహానేతను కోల్పోయిందన్నారు. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలన్నారు.


More Telugu News