వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీవోను పరామర్శించిన పవన్ కల్యాణ్

  • ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి
  • కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబు
  • 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు
వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రిమ్స్ ఆసుపత్రికి బయల్దేరారు. ఆసుపత్రిలో జవహర్ బాబును పరామర్శించిన తర్వాత... దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు వైద్యులు వివరించారు.  

మరోవైపు ఎంపీడీవోపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహర్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.


More Telugu News