ధరణి పోర్టల్‌కు కాలం చెల్లిపోనుంది... జనవరి 1 నుంచి అమల్లోకి భూ భారతి

  • డిసెంబర్ 31తో కాలం చెల్లిపోనున్న ధరణి పోర్టల్
  • భూ భారతి పోర్టల్‌ను నిర్వహించనున్న ఎన్ఐసీ
  • ధరణి డేటాను ఎన్ఐసీకి బదిలీ చేయనున్న టెర్రాసిస్
భూ భారతి కొత్త ఆర్వోఆర్ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌కు ఈ నెల 31తో కాలం చెల్లిపోనుంది. ధరణి పోర్టల్ నిర్వహణను టెర్రాసిస్ చూస్తోంది. ఈ గడువు కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది నుంచి భూ భారతి పోర్టల్ అమల్లోకి రానుంది.

భూ భారతి పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) పూర్తిస్థాయిలో నిర్వహించనుంది. ధరణి పోర్టల్ పూర్తి డేటాను టెర్రాసిస్ సంస్థ ఎన్ఐసీకి బదిలీ చేయనుంది. డేటా బదిలీ పూర్తయ్యాక భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తోంది.


More Telugu News