మొదటి టెస్టు నుంచే నన్ను ఆకట్టుకున్నాడు: నితీశ్ టెస్టు సెంచరీపై సచిన్ స్పందన
- ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
- సర్వత్రా ప్రశంసల వర్షం
- నితీశ్ ను అభినందించిన సచిన్
- ప్రశాంతంగా ఆడుతూనే టెంపర్ మెంట్ చూపిస్తున్నాడని కితాబు
పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేనప్పటికీ, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై టెస్టుల్లో సెంచరీ సాధించడం ద్వారా తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో నితీశ్ సెంచరీనే హైలైట్. ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ సాధించడం ఈ ఆంధ్రా క్రికెటర్ దృఢ సంకల్పాన్ని చాటుతోంది. కాగా, నితీశ్ కు టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
నితీశ్ ఘనతపై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు. నితీశ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ గుర్తుండిపోతుందని ట్వీట్ చేశాడు.
"నితీశ్ నన్ను మొదటి నుంచి ఆకట్టుకున్నాడు. ప్రశాంతంగా ఆడుతూనే, తన టెంపర్ మెంట్ ను చూపిస్తున్నాడు. ఇవాళ తన ఆటతీరును ఉన్నతస్థాయికి తీసుకెళ్లి సిరీస్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, వాషింగ్టన్ సుందర్ శక్తిమేర అద్భుతంగా ఆడి సహకారం అందించాడు... ఇద్దరూ బాగా ఆడారు" అంటూ సచిన్ అభినందించాడు.