హెచ్ఎంపీవీ వైరస్... అప్రమత్తమైన ఏపీ... చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
- కర్ణాటక, గుజరాత్‌లో హెచ్ఎంపీవీ కేసులు
- వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
- ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
- ఏపీలో కేసులు నమోదు కాలేదని వెల్లడి
హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై ఆయన అధికారులను అడిగారు. అయితే ఏపీలో ఎలాంటి అనుమానిత కేసులు నమోదు కాలేదని అధికారులు సీఎంకు తెలిపారు.
కర్ణాటకలో, గుజరాత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు... సీఎంకు తెలిపారు. రాష్ట్రానికి వచ్చి వెళ్లే వారిపై దృష్టి పెట్టాలని, అనుమానం ఉంటే పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో సీఎంతో పాటు మంత్రి మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.