పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై డాక్టర్ గురుమహేశ్ వ్యాఖ్యలు

  • పోసాని కృష్ణమురళికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్న డాక్టర్
  • విచారణకు ఆరోగ్య సమస్యలు ఎదురు కావని వెల్లడి
  • నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ తెలిపారు. పోలీసుల విచారణకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఆటంకం లేదని వెల్లడించారు. పోసానికి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.

పోసాని కృష్ణమురళిని కలిసేందుకు ఆయన తరఫు న్యాయవాది నాగిరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కానీ, పోలీసులు ఆయనను అనుమతించలేదు. అధికారుల అనుమతి లేకుండా లోపలికి పంపించలేమని సీఐ చెప్పడంతో ఆయన వెనుదిరిగారు.

స్థానిక వైసీపీ నేత శ్రీనివాసులు తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోసానిని చూడాలని పోలీసులను కోరారు. అయితే, విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు చెప్పడంతో ఆయన వెనుదిరిగారు.


More Telugu News