కేసీఆర్ ఫ్యామిలీ దొంగ నోట్ల దందా చేసింది: బండి సంజయ్ సంచలన ఆరోపణలు

  • బీదర్ లో బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉందన్న బండి సంజయ్
  • ఆ ప్రెస్ లోనే దొంగ నోట్లు ముద్రించారని వెల్లడి
  • ఆ నోట్లను ఉద్యమంలో, ఎన్నికల్లో పంచారని ఆరోపణలు 
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని బీదర్ లో బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉందని అన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో దొంగ నోట్లు ముద్రించి, ఆ నోట్లను ఉద్యమంలో, ఎన్నికల్లో పంచారని వివరించారు. దొంగ నోట్ల దందాతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు కోటీశ్వరులయ్యారని బండి సంజయ్ పేర్కొన్నారు. కానీ తెలంగాణ మాత్రం అప్పులపాలైందన్నారు. 

మార్పు కోరుకున్న ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేశారని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News