ఉగాది సెల‌బ్రేష‌న్స్‌లో క్లింకార... వీడియో షేర్ చేసిన ఉపాస‌న‌

  
మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న త‌న ఇంట్లో ఉగాది పండుగ వేడుక‌ల‌కి సంబంధించి ఓ వీడియోను తాజాగా షేర్ చేశారు. ఇందులో ఉపాస‌న‌, క్లింకార‌, సురేఖ‌లు పూజ మందిరంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం క‌నిపించింది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

అయితే, ఇందులో క్లింకార ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. చిన్నారిని ఫేస్ క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేసినా కూడా సైడ్ యాంగిల్‌లో కాస్త క‌నిపిస్తుండ‌డంతో మెగాభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. పింక్ డ్రెస్ ధ‌రించి ప‌ద్ధ‌తిగా పూజ‌లో కూర్చున్న క్లింకార ఫోటోల‌ని ఫ్యాన్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు. 

అయితే, క్లింకార పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ చిన్నారి ఫేస్ ఎలా ఉందో చూడాల‌ని మెగా ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతూనే ఉన్నారు. కానీ ఏ ఫొటో షేర్ చేసిన కూడా అందులో క్లింకార ఫేస్ క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది మెగా ఫ్యామిలీ.


More Telugu News