వ‌క్ఫ్ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

  • బుధవారం లోక్‌సభలో వ‌క్ఫ్ బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ
  • అర్ధరాత్రి తర్వాత బిల్లుపై స్పీకర్‌ ఓం బిర్లా ఓటింగ్‌
  • 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు 
  • వ్యతిరేకించిన 232 మంది స‌భ్యులు
వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు.

మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. ఇక ఈరోజు ఈ వక్ఫ్‌ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు.

కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.


More Telugu News