పవన్ కల్యాణ్ కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై నాదెండ్ల మనోహర్ స్పందన

  • మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న మనోహర్
  • ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడి
  • పవన్ తో ప్రధాని మోదీ మాట్లాడారన్న ఏపీ మంత్రి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడగా... పదేళ్ల బాలిక మృతి చెందింది. 

ఈ ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.


More Telugu News