డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు కృష్ణ‌భ‌గ‌వాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

    
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు, క‌మెడియ‌న్‌ కృష్ణ‌భ‌గ‌వాన్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హాయిగా ఉండే సినిమా ఫీల్డ్‌ను వ‌దిలి ఎండ‌లో తిరుగుతూ, మాట‌లు ప‌డుతూ న‌మ్మిన పార్టీని ప‌ట్టుకుని నిల‌బ‌డ్డారు ప‌వ‌న్ అని అన్నారు. క‌ష్టే ఫ‌లి అని పేర్కొన్నారు. అందుకే కృషి ఉంటే మ‌నుషులు ఉప ముఖ్య‌మంత్రులు అవుతార‌ని కృష్ణ‌భ‌గ‌వాన్ చ‌మ‌త్క‌రించారు. ఇక సినిమా షూటింగ్‌ల‌ప్పుడూ కూడా ప‌వ‌న్ సెట్‌లో చాలా సాధార‌ణంగా క‌నిపిస్తార‌ని అన్నారు. 

స‌ర్దార్‌ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ అప్పుడు త‌న‌తో కూడా చాలా బాగా మాట్లాడిన‌ట్లు ఆయ‌న గుర్తు చేసుకున్నారు. త‌న గురించి గుర్తుపెట్టుకుని మ‌రీ మీరు మంచి రైట‌ర్ క‌దా... అని మాట్లాడిన‌ట్టు కృష్ణ‌భ‌గ‌వాన్ తెలిపారు. హీరో, డిప్యూటీ సీఎం అనే భావ‌న లేకుండా ఒక మంచి మ‌నిషిలా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. కృష్ణ‌భ‌గ‌వాన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై ప‌వ‌న్ అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 


More Telugu News