భారతీయులను పాక్ హైకమిషన్ అధికారి బెదిరించిన ఘటనపై స్పందించిన బ్రిటన్

  • లండన్‌లో భారతీయుల నిరసన సందర్భంగా ఘటన
  • ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించిన ప్రతినిధి
  • ఉగ్రవాద నిర్మూలనకు చేసే పోరాటంలో మద్దతు ఉంటుందని వ్యాఖ్య
లండన్‌లో పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్న భారతీయులను పాకిస్థాన్ హైకమిషన్ అధికారి బెదిరించినట్లు వచ్చిన వీడియోపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ దాడికి పాల్పడిన దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి భారత్‌ను కోరారు. ఉగ్రవాద నిర్మూలనకు న్యూఢిల్లీ చేస్తున్న పోరాటంలో తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

భారత్, పాకిస్థాన్‌లతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత భారత్, పాకిస్థాన్‌లపై ఉందని బ్రిటన్ సూచించింది.


More Telugu News