ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులు... ఏపీ వాతావరణ పరిస్థితులపై ఆసక్తికర అప్ డేట్
- ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు
- సోమ, మంగళవారాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన
- రాబోయే రెండు రోజులు 41.5°C - 43°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవకాశం
- ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులకు ఆస్కారం
- నేడు తిరుపతి జిల్లాలో అత్యధికంగా 42.8°C ఉష్ణోగ్రత నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పందించారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూర్మనాథ్ వివరించారు. అదే సమయంలో, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని, కొన్ని చోట్ల 41.5 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ఆదివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని ఆయన సూచించారు.
నేటి ఉష్ణోగ్రతల వివరాలను వెల్లడిస్తూ, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో అత్యధికంగా 42.8 డిగ్రీల సెల్సియస్, ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో 41.5 డిగ్రీలు, పల్నాడు జిల్లా క్రోసూరులో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కూర్మనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రత నుంచి, అలాగే పిడుగుల బారి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.