సంగారెడ్డిలో దారుణం.. ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

  • సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో దారుణం
  • భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని మనస్తాపంతో దారుణం
  • ఇద్దరు పిల్లలకు ఇంట్లో ఉరివేసిన తండ్రి
సంగారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామంలో తండ్రి ఇద్దరు కుమార్తెలను హతమార్చి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మల్కాపూర్ గ్రామానికి చెందిన సుభాష్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వారి పేర్లు మారిన్ (13), ఆరాధ్య (10). సుభాష్ మొదట తన ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉరివేసి చంపి, అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సుభాష్ భార్య కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, భార్య దూరమవడంతో మనస్తాపానికి గురైన సుభాష్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News